ఆఖర్లో వర్షం: మిథాలీ సేన ఓటమి - brilliant lee single handedly powers south africa to win in 3rd womens odi
close
Published : 12/03/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఖర్లో వర్షం: మిథాలీ సేన ఓటమి

లఖ్‌నవూ: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి చవిచూసింది. సఫారీ ఓపెనర్‌ లిజెల్‌ లీ (132*; 131 బంతుల్లో 16×4, 2×6) ఒంటిచేత్తో తన జట్టు విజయానికి బాటలు వేసింది. వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలిపింది. ఫలితంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 6 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోడ్రిగ్స్‌ (0) మరోసారి విఫలమవ్వగా మరో ఓపెనర్‌ స్మృతి మంధాన (25; 27 బంతుల్లో 4×4) భారీ స్కోరు చేయలేకపోయింది. పూనమ్‌ రౌత్‌ (77; 108 బంతుల్లో 11×4) అర్ధశతకంతో రాణించింది. ఆ తర్వాత మిథాలీ రాజ్‌ (36; 50 బంతుల్లో 5×4), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (36; 46 బంతుల్లో 4×4, 1×6), దీప్తి శర్మ (36*; 49 బంతుల్లో 2×4) ఫర్వాలేదనిపించడంతో భారత్‌ రక్షించుకోగల స్కోరునే చేసింది.

ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాను టీమ్‌ఇండియా బౌలర్లు కట్టడి చేస్తున్నా ఓపెనర్‌ లిజెల్‌ మాత్రం అద్భుతంగా ఆడింది. లారా వోల్వార్డ్‌ (12), లారా గుడాల్‌ (16) విఫలమైనా మిగ్నాన్‌ డు ప్రీజ్‌ (37; 46 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి చెలరేగింది. భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఆమె మాత్రం వికెట్‌ ఇవ్వలేదు. విజయానికి 30 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన స్థితిలో లిజెల్‌ దూకుడుగా ఆడింది. 46.3 ఓవర్లకు వర్షంతో మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికాను 223/4తో నిలిపింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 6 పరుగుల ఆధిక్యం ఉండటంతో ఆ జట్టు విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్‌ 10వేల పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం. 5 వన్డేల సిరీసులో భారత్‌ 1-2తో వెనకబడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని