విటమిన్‌ ‘సి’ ఇమ్యునిటీ ప్రదాత - build your immunity to fight covid: lemon juice in warm water
close
Published : 27/04/2021 22:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విటమిన్‌ ‘సి’ ఇమ్యునిటీ ప్రదాత

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి జడలు విప్పి విలయ తాండవం చేస్తున్న వేళ ఈ ‘సి’ విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా బారిన పడకుండా కాపాడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్‌ల తాజా నిమ్మరసం, కాస్త ఉప్పు, తేనె వేసుకుని రోజుకు రెండు పూటలా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పగటి వేళ గ్రీన్‌టీలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ‘సి’ విటమిన్‌ అందుతుందని చెబుతున్నారు.

విటమిన్‌ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు కనీసం 500 మి.గ్రా విటమిన్‌ ‘సి’ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు పరిశోధనల్లో తేలింది.

ఎర్రరక్తకణాల తయారీలో, ఆక్సిజన్‌ రవాణాలో ఖనిజ లవణం ఐరన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో ఐరన్‌ స్థాయులు పడిపోయినప్పుడు విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపాన్ని అధిగమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంకా విటమిన్‌ ‘సి’ గాయాలను మాన్పడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు కరిగించడానికి, చర్మం అరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది. అధిక రక్తపోటునూ తగ్గిస్తుంది. రక్తంలోని యూరిక్‌ ఆమ్ల స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. ‘సి’ విటమిన్‌ ముఖ్యంగా నిమ్మ, నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, కివీ పండు, జామ, బొప్పాయి, ఉసిరి, బ్రకోలీ, బచ్చలికూర, క్యాబేజీ, పచ్చిమిరప, బంగాళదుంప, కొత్తిమీరలలో అధికంగా లభిస్తుంది. అదే విధంగా అతి ఎప్పుడూ అనారోగ్యమే. మోతాదుకి మించి విటమిన్‌ ‘సి’ తీసుకోకూడదు. అమెరికా డైట్రీ రిఫరెన్స్‌ ఇన్‌టేక్‌ సూచనల ప్రకారం యుక్తవయసులో ఉన్న అబ్బాయిలు రోజుకు 75 మి.గ్రా, అమ్మాయిలు 65 మి.గ్రా, పురుషులు 90 మి.గ్రా, మహిళలు75 మి.గ్రా, పాలిచ్చే తల్లులు 120 మి.గ్రా విటమిన్‌ ‘సి’ తీసుకోవాల్సి ఉంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని