ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..! - bunny personal trainer is also traveling with him for pushpa location
close
Updated : 05/03/2021 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!

హైదరాబాద్‌: పాత్రకు తగినట్టు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు మన హీరోలు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ అయితే కథకు అనుగుణంగా లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ‘బద్రినాథ్‌’, ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఇలాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ప్రస్తుతం తెరకెక్కుతోన్న ‘పుష్ప’ కోసం బన్నీ ఎంతో కష్టపడుతున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే చిత్తూరు యాసలో శిక్షణ తీసుకున్న ఆయన ఫిటినెస్‌ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’కు అనుగుణంగా బన్నీ వ్యక్తిగత ట్రైనర్‌ ఇప్పటికే ఆయన్ని అన్నివిధాలుగా సిద్ధం చేశారట. అయితే, శిక్షణ విషయంలో ఎలాంటి అంతరాయం కలగకూడదని భావించిన బన్నీ.. తనతోపాటు వ్యక్తిగత ట్రైనర్‌ని సైతం లొకేషన్‌కు తీసుకువెళ్తున్నారట. అంతేకాకుండా రోజులో రెండుసార్లు క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తున్నారట. ఈ మేరకు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ-సుకుమార్‌ దర్శకత్వంలో రానున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పోస్టర్లు ప్రేక్షకుల్ని ఎంతో ఆకర్షించాయి. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని