Maharashtra: 7 గంటల పాటు బస్సుపైనే డిపో మేనేజర్.. ఎందుకంటే..?  - bus depot manager camps on top of bus for 7 hours
close
Published : 26/07/2021 23:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maharashtra: 7 గంటల పాటు బస్సుపైనే డిపో మేనేజర్.. ఎందుకంటే..? 

(ప్రతీకాత్మక చిత్రం)

ముంబయి: మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తాయి. ఈ క్లిష్ట సమయంలో కూడా తన విధి నిర్వహణను మర్చిపోలేదు రత్నగిరి చెందిన డిపో మేనేజర్. బస్సులు సైతం నీట మునిగిన ప్రాంతంలో ప్రభుత్వ సొమ్మును కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కయచేయలేదు. వరదకు జంకకుండా ఏడు గంటలు బస్సుపైభాగంలో నిల్చుండిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే.. 

భారీగా కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగడంతో మహారాష్ట్రలోని రత్నగిరి, కొల్హాపూర్, సంగ్లి ప్రాంతాలు నీట మునిగాయి. రత్నగిరి జిల్లాకు చెందిన చిప్లన్ బస్ డిపో మేనేజర్ రంజీత్ రాజె షిర్డే ఆ వరద నీటిలో చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైనా ప్రాణాలు కాపాడుకొని, ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారు. కానీ ఆయనకు మాత్రం తన విధులే గుర్తుకొచ్చాయి. ఆ రోజు వచ్చిన ఆదాయం రూ. 9లక్షల్ని కాపాడుకునేందుకు స్థలం కోసం వెతగ్గా.. బస్సుపైభాగమే సరైందని గుర్తించారు. ఆ డబ్బు తీసుకొని ఏడు గంటల పాటు దానిపై నిల్చొని ఉన్నారు. ‘వరద నీరు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ డబ్బును కార్యాలయంలోనే ఉంచితే నీట పాలయ్యే అవకాశం ఉందని అర్థమైంది. దాన్ని సురక్షితంగా ఉంచడం నా బాధ్యత. అందుకే ప్రాణాలను లెక్కచేయకుండా నా విధులకే ప్రాధాన్యత ఇచ్చాను’ షిర్డే మీడియాకు వెల్లడించారు. తనతో ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారని, తాము డబ్బును సురక్షిత ప్రాంతంలో భద్రపరిచామని చెప్పారు. నీటి ఉద్ధృతి తగ్గిన తర్వాత డిపోలో నెలకొన్న పరిస్థితిపై పై అధికారులకు సమాచారమందించారు.   



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని