Ice cubes: కరిగిపోయే సీతాకోకచిలుక..! - butterfly shaped ice cubes are taking over the internet
close
Published : 06/08/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ice cubes: కరిగిపోయే సీతాకోకచిలుక..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతున్న టెక్నాలజీ పరిజ్ఞానం, విస్తరిస్తున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకుంటూ ఈ రోజుల్లో రెస్టారెంట్లను నడపడం అంత సులువేం కాదు. ఎప్పటికప్పుడు రెస్టారెంట్లు వాటి వ్యూహాల్ని మార్చుకుంటూ ఆహార ప్రియుల్ని ఆకట్టుకోవాలి. రుచికరమైన ఆహారాన్ని అందించడం మాత్రమే కాదు. ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునే విధంగానూ వాటిని ప్రదర్శించాలి. వినూత్న ఆలోచనలతో సరికొత్త మార్గాలను అనుసరించాలి. ఇదే తరహాలో ఆకర్షణీయంగా తయారుచేసిన డ్రింక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీతాకోకచిలుక ఆకారంలోని ఐస్‌ ముక్కలను (క్యూబ్స్‌) జోడించి తయారుచేసిన ఆ డ్రింక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. @blestallure అనే పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతాలో ఆ ఫొటో పొందుపరిచారు. ఇప్పటికే ఈ ఫొటోకు 2 లక్షలకు పైగా లైక్స్‌, 40వేల రీట్వీట్లు వచ్చాయి. ఈ ఫొటోలో సాధారణ ఐస్‌ ముక్కలను కలిపిన రెండు వేర్వేరు రంగులతో కూడిన (ఒకటి రోజ్‌ ఫ్లెవర్డ్, మరొకటి గ్రీన్‌ మట్చా టీ) పానీయాలు ఉంటాయి. వీటిలో సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న ఐస్‌ ముక్కలను చేర్చడంతో ఆ డ్రింక్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్‌ యూజర్స్‌ ఈ ఫొటోను చూడగానే మంత్ర ముగ్ధులవుతున్నారు. మరికొంత మంది ఇటువంటి డ్రింక్‌ ఎక్కడ దొరుకుతుందో చెప్పమని షేర్‌ చేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని