తిరుపతి, సాగర్‌ ఉపఎన్నికలకు షెడ్యూల్‌ - by election schedule
close
Updated : 16/03/2021 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి, సాగర్‌ ఉపఎన్నికలకు షెడ్యూల్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. 2 లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీలోని తిరుపతి లోక్‌సభకు, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈనెల 23 నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఏప్రిల్‌ 17న తిరుపతి, నాగార్జున సాగర్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 30 వరకు నామినేషన్ల దాఖలుకు ఈసీ గడువు విధించింది.

ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువుగా నిర్ణయించింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వైకాపా ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతితో తిరుపతిలో.. తెరాస ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని