86శాతం కేసులు.. ఆ 6 రాష్ట్రాల్లోనే - cabinet secy to hold review meeting with states uts showing rise in covid 19 cases
close
Updated : 27/02/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

86శాతం కేసులు.. ఆ 6 రాష్ట్రాల్లోనే

దిల్లీ: దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. వరుసగా మూడో రోజు కొత్త కేసుల సంఖ్య 16వేలకు పైనే ఉంది. అయితే ఇందులో 86శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో కొత్త కేసులు పెరిగినట్లు తెలిపింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 8,333 కేసులు బయటపడగా.. కేరళలో 3,671, పంజాబ్‌లో 622 మందికి కొత్తగా వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు కూడా పెరుగుతున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో ఫిబ్రవరి 14న 34,449 యాక్టివ్‌ కేసులుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 68,810కి పెరిగింది. అయితే కేరళలో మాత్రం క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిస్తోంది.

కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో నేడు కేబినెట్‌ సెక్రటరీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెంచాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ప్రజలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, వ్యాప్తిని అరికట్టాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని