వచ్చే ఏడాదిలో 2 బిలియన్ల డోసులు - can deliver approximately 2 billion doses in 2021: german firm biontech
close
Published : 11/01/2021 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే ఏడాదిలో 2 బిలియన్ల డోసులు

వెల్లడించిన జర్మన్‌ సంస్థ బయోటెక్‌

బెర్లిన్‌: పాశ్చాత్యదేశాల్లో కరోనా వైరస్‌ తొలి వ్యాక్సిన్‌కు అనుమతి పొందిన సంస్థ బయోఎన్‌టెక్‌ వచ్చే ఏడాదిలో 2 బిలియన్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ప్రకటించారు. ఫైజర్‌తో కలిసి కొవిడ్‌ టీకాను రూపొందించిన ఈ సంస్థ గతంలో 1.3 బిలియన్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ‘‘ప్రస్తుతం మేం సుమారు 2 బిలియన్లు డోసులు ఉత్పత్తి చేయగలమని ఆశిస్తున్నాం. మా సామర్ధ్యాన్ని 2021 చివరికల్లా నిరూపించుకుంటాం. దీనిలో ప్రస్తుతం సూచించినట్లు ఆరు మోతాదులు కూడా ఉండొచ్చు.’’ అని  సంస్థ తెలిపింది. ఫిబ్రవరిలో మార్‌బర్గ్‌ ప్రాంతంలో కొత్త కర్మాగారాన్ని ప్రారంభించి వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున తయారు చేస్తామని వారు వెల్లడించారు.

ఇవీ చదవండి..

టీజర్‌లాగే సినిమా కూడా నచ్చుతుంది..

కొవిడ్‌ డోసుల కోసం కేంద్రం ఆర్డర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని