మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను: చిరంజీవి
ఇంటర్నెట్ డెస్క్: ‘వకీల్‌సాబ్’ కోసం అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పవన్‌కల్యాణ్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్‌ను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో చిరు తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌కు జుట్టు సరిచేస్తున్న పాత ఫొటో కూడా పంచుకున్నారు. ‘చాలాకాలం తర్వాత పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబసభ్యులతో రేపు సాయంత్రం థియేటర్లో వకీల్‌సాబ్ చూడనున్నాం. సినిమా చూసిన తర్వాత నా స్పందన మీతో పంచుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను’ అని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
హిందీలో మంచి విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ ఈ ‘వకీల్‌సాబ్’. ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్ హీరోగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమా మే 13న విడుదల కానుంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
గుసగుసలు
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..