Viral Video: గొల్లభామల పజిల్‌ వీడియో చూశారా! - can you find the insects hidden in this puzzle video
close
Published : 30/07/2021 23:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral Video: గొల్లభామల పజిల్‌ వీడియో చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్నటి కాళ్లతో నాజూకైన శరీరంతో కనువిందు చేస్తాయి గొల్లభామలు. ఇతర కీటకాల నుంచి రక్షణ పొందడానికి అవి ఉండే పరిసర ప్రాంతాలకు సంబంధించిన రంగుల్లో కలిసిపోతాయి. అలా ఏర్పడ్డ గొల్లభామలను చెట్టు కొమ్మల్లో, ఎండుపుల్లల్లో కనిపెట్టడం చాలా కష్టం. అటువంటి గొల్లభామలకు సంబంధించిన ఓ పజిల్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలోని చిత్రాల్లో ఆకులు, పుల్లల మధ్య కొన్ని గొల్లభామలు దాగి ఉన్నాయి. ఏడు సెకన్ల వ్యవధిలో వాటిని గుర్తించాలి. లేదంటే.. నిర్ణీత వ్యవధి తర్వాత చిత్రంలోని గొల్లభామలు ఒక్కొక్కటిగా కనిపిస్తాయి. ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోన్న ఈ వీడియోను అమెరికాకు చెందిన బ్రోంక్స్‌ జూ అధికారులు తమ ఇన్‌స్టాగ్రాం ద్వారా ఖాతా పంచుకున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని