Canada: భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం పొడిగించిన కెనడా - canada extends ban on passenger flights from india till 21st september
close
Published : 10/08/2021 22:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Canada: భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం పొడిగించిన కెనడా

ఒట్టావా: భారత్‌లో డెల్టా రకం కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై విధించిన నిషేధాన్ని కెనడా మరోసారి పొడిగించింది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి భారత్‌ విమానాలపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాజ్ఞలు ఆగస్టు 21తో ముగియనున్నాయి.

అయితే భారత్‌లో కరోనా వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్‌ ఆందోళనకరంగానే ఉండటంతో విమానాలపై నిషేధాన్ని సెప్టెంబర్ 21 వరకూ పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.  ప్రజారోగ్య విభాగం సలహా మేరకు  ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్ ఉద్ధృతితో ఏప్రిల్ 22న తొలిసారిగా భారత్  నుంచి వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది. ఇప్పటి వరకూ నిషేధాన్ని ఐదుసార్లు పొడిగించింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని