కరోనాపై పోరుకు కెనడా రూ.74 కోట్ల సాయం! - canada offers 10 million dollors to india for battle with covid 19
close
Published : 29/04/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై పోరుకు కెనడా రూ.74 కోట్ల సాయం!

ఒట్టావా: కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు సాయం అందించేందుకు కెనడా ముందుకు వచ్చింది. భారత్‌లో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడ్‌ క్రాస్‌ సొసైటీల ద్వారా 10 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.74కోట్ల)ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్జాతీయ అభివృద్ధి వ్యవహారాల మంత్రి కరీనా గౌల్డ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్న భారత్‌కు మానవతా దృక్పథంతో సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కెనడా రెడ్‌ క్రాస్‌ సంస్థ నుంచి భారత్‌లోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలకు 10 మిలియన్‌ డాలర్లు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని కరీనా ఓ ప్రకటనలో వెల్లడించారు. 

భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 3.60లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 3,293 మంది ప్రాణాలు వదిలారు. అయితే భారత్‌లో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యూఎస్‌, బ్రిటన్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. బ్రిటన్‌ నుంచి బుధవారం తక్షణ సాయంగా వంద వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు భారత్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని