టీకాతో ఆనందం.. గడ్డ కట్టిన సరస్సుపై డ్యాన్స్‌! - canadian dancer does bhangra on frozen lake after getting covid vaccine. viral video
close
Published : 03/03/2021 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాతో ఆనందం.. గడ్డ కట్టిన సరస్సుపై డ్యాన్స్‌!

యుకోన్‌: కరోనా వైరస్‌ ప్రతి ఒక్కరినీ భయపెట్టమే కాదు.. మన జీవితాలనూ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో కరోనా అంతానికి బ్రహ్మాస్త్రమైన టీకా విడుదల కోసం ప్రతిఒక్కరూ ఆశతో ఎదురుచూశారు. టీకా తీసుకున్న పలువురు తమ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, కెనడాలో ఉంటున్న గుర్‌దీప్‌ పంధేర్‌ అనే డ్యాన్స్‌ మాస్టర్‌ మాత్రం తన సంతోషాన్ని వినూత్నంగా వ్యక్తపరిచారు. టీకా తీసుకున్న ఆనందంలో గడ్డకట్టిన సరస్సుపైకి వెళ్లి భాంగ్రా నృత్యం చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా 18లక్షల మందికి పైగా వీక్షించారు. ‘‘నిన్న సాయంత్రం నేను కొవిడ్‌ టీకా తీసుకున్నాను. ఆ సంతోషంతో ఓ గడ్డకట్టిన సరస్సుపై భాంగ్రా నృత్యం చేశాను. ప్రపంచవ్యాప్తంగా అందరి శ్రేయస్సును కోరుకుంటున్నా’’ అని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. కరోనా టీకాపై అందరికీ ఇలా ఆయన అవగాహన కల్పిస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని