RRRను బాహుబలితో పోల్చలేం: విజయేంద్రప్రసాద్‌ - cannot be compared to baahubali says vijayendra prasad
close
Published : 22/07/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRRను బాహుబలితో పోల్చలేం: విజయేంద్రప్రసాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ‘బాహుబలి’తో పోల్చలేమని సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ అన్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. రాజమౌళి చేసే ఏ రెండు సినిమాలనూ ఒకదానితో ఒకటి పోల్చలేమని, అయితే.. నిర్మాణం విషయంలో ‘బాహుబలి’ కంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చాలా పెద్దదని ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అన్నారు. ‘బాహుబలి’ విజువల్‌ వండర్‌ అయితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎమోషనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అని ఆయన అన్నారు.

“ఎస్.ఎస్.రాజమౌళి ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఆయన చేసే ఒక సినిమాకు ఇంకో సినిమాకు పోలిక ఉండదు. ‘స్టూడెంట్ నంబర్ 1’తో దర్శకుడిగా రాజమౌళి పరిశ్రమకు పరిచయమయ్యారు. దానికి రాఘవేంద్రరావు కథ అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘సింహాద్రి’ వచ్చింది. అప్పట్లో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయింది. ఆ చిత్రంలో ఇంటర్వెల్‌ సీన్‌ అద్భుతం. ఆ తర్వాత చాలామంది దీనిని అనుకరించటానికి చాలా సంవత్సరాలు ప్రయత్నించారు. ఆ తర్వాత రాజమౌళి రగ్బీ క్రీడతో ‘సై’ తీశారు. ఆ తర్వాత ‘ఛత్రపతి’. ఆ వెంటనే ‘విక్రమార్కుడు’ వచ్చింది. ఆ సినిమా రాజమౌళికి మంచి ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చింది. ‘యమదొంగ’, ‘మగధీర’ వచ్చాయి. ‘మగధీర’ భారీ విజయం తరువాత పెద్దపెద్ద హీరోలు రాజమౌళితో కలిసి పనిచేయడానికి ఎదురుచూశారు. కానీ.. హాస్యనటుడు సునీల్‌తో ‘మర్యాద రామన్న’ రూపొందించాడు. ఆ తర్వాత వినూత్నంగా ’ఈగ’ దాని తర్వాత ‘బాహుబలి’ వచ్చింది. కాబట్టి, రాజమౌళి చేసే ఏ రెండు సినిమాల మధ్య పోలిక ఉండదు’’ అని విజయేంద్రప్రసాద్‌ అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని