‘తప్పు పట్టను’ అంటోన్న మోర్గాన్‌ - cant fault our group for 1st odi defeat morgan
close
Published : 25/03/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తప్పు పట్టను’ అంటోన్న మోర్గాన్‌

పుణె: తొలి వన్డేలో ఓటమికి జట్టును తప్పుపట్టడం లేదని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో తమ జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించిందని పేర్కొన్నాడు. మధ్యలో భాగస్వామ్యాలు లేకపోవడం వల్లే  ఓటమి పాలయ్యామని వెల్లడించాడు. 48 గంటలు గడిచాకే తమ గాయాలపై స్పష్టత వస్తుందని స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియా నిర్దేశించిన 318 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్‌ జట్టు విఫలమైంది. 66 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

‘మాది ప్రమాదకరమైన జట్టని నా విశ్వాసం. మ్యాచులో దాదాపుగా మేం బాగా ఆడాం. అలాగే బ్యాటింగ్‌ కొనసాగించి ఉంటే లక్ష్యాన్ని చాలా త్వరగా ఛేదించేవాళ్లం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో టీమ్‌ఇండియా ఒకటి. చాలాసార్లు వారితో కఠిన సవాళ్లే ఎదురవుతాయి. అయితే నేను మా జట్టును తప్పుపట్టను. కోహ్లీసేన చక్కగా బౌలింగ్‌ చేసింది. మేం పొరపాట్లు చేశాం. మధ్యలో భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. మేం నంబర్‌వన్‌గా ఉండటమే ముఖ్యం కాదు. నాణ్యమైన జట్టును నిర్మించుకోవడం మా లక్ష్యం’ అని మోర్గాన్‌ తెలిపాడు.

మ్యాచ్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా మోర్గాన్‌ చేతికి గాయమైంది. కుడిచేతి బొటన వేలు, చూపుడు వేలి మధ్య చీలిక ఏర్పడింది. నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది. సామ్‌ బిల్లింగ్స్‌ ఎడమ భుజం స్థాన భ్రంశమైంది. ‘మేం 48 గంటలు వేచిచూడాల్సి ఉంది. శుక్రవారం వరకు కోలుకుంటామనే అనిపిస్తోంది. బిల్లింగ్స్‌తో ఇంకా మాట్లాడలేదు. ఏదేమైనా ఎవ్వరూ 100% ఫిట్‌గా ఉండరు. నేనైతే బ్యాటు పట్టుకోలేనంత ఇబ్బంది పడటం లేదు’ అని మోర్గాన్‌ అన్నాడు. శుక్రవారం రెండు జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని