‘న్యాయవ్యవస్థపై కుట్ర’ కేసు మూసివేత - cant rule out conspiracy against ex chief justice ranjan gogoi top court
close
Updated : 18/02/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘న్యాయవ్యవస్థపై కుట్ర’ కేసు మూసివేత

దిల్లీ: భారత మాజీ సీజేఐ రంజన్‌ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కుట్రపూరితమంటూ నమోదు చేసిన సుమోటో కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. ఈ మేరకు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వెల్లడించింది. జస్టిస్‌ పట్నాయక్‌ కమిటీ, సీజేఐ ఎస్‌ఏ బోబ్డేల నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు. రెండేళ్లు గడిచినా ఈ కేసులో ఎలక్ట్రానిక్‌ ఆధారాలు చేతికి అందలేదని పేర్కొంది. ఈ కేసును ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం నిర్ణయించింది. 

కాగా, మాజీ సీజేఐ రంజన్‌ గొగొయి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెండేళ్ల కిందట సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తద్వారా ఆయన తన భర్తను, ఇతర కుటుంబసభ్యులను బాధితులుగా మార్చారని ఆమె పేర్కొని సంచలనం సృష్టించారు. 
 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని