ANH: కెప్టెన్‌ ట్వీట్‌.. సూర్య రిప్లై - captain gopinath: soorarai pottru brought back many memories
close
Published : 13/11/2020 23:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ANH: కెప్టెన్‌ ట్వీట్‌.. సూర్య రిప్లై

చెన్నై: ‘‘కొన్ని సన్నివేశాలు చూసి నవ్వుకున్నాను. మరికొన్ని సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను’’ అని అన్నారు ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ గోపీనాథ్‌. ఆయన జీవితంలోని అంశాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. అతితక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకు సైతం విమాన ప్రయాణాన్ని అందించాలనే గోపీనాథ్‌ ఆలోచనను సినిమాలో చక్కగా చూపించారని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. నాయకానాయికలు సూర్య, అపర్ణ.. దర్శకురాలు సుధా కొంగరను ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ గోపీనాథ్‌ కూడా స్పందించారు. 

ఇటీవల చిత్రాన్ని వీక్షించిన గోపీనాథ్‌ సోషల్‌ మీడియా వేదికగా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘సినిమా అద్భుతంగా ఉంది. ‘సింప్లీ ఫ్లై’ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. సినిమా నాకు ఆనాటి రోజుల్ని గుర్తు చేసింది’’ అని గోపీనాథ్‌ ట్వీట్‌ చేశారు. దాంతోపాటు సినిమాలో ప్రధాన నటీనటుల్ని పొగడ్తలతో ముంచెత్తారు. గోపీనాథ్‌ ట్వీట్‌పై సూర్య కూడా స్పందించారు. ‘డియర్‌ కెప్టెన్, ఈ సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు దేశానికి చేసిన సేవను తెలియజేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడం మాకెంతో గౌరవంగా ఉంది. ఇది ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని సూర్య పేర్కొన్నారు.

ఆయన ఇంకా ఏం ట్వీట్ చేశారంటే?




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని