కార్తీక్‌ ఆర్యన్‌ ‘కెప్టెన్‌ ఇండియా’ - captain india first look poster out
close
Published : 24/07/2021 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్తీక్‌ ఆర్యన్‌ ‘కెప్టెన్‌ ఇండియా’

ముంబయి: బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ నుంచి రానున్న కొత్త చిత్రం ‘కెప్టెన్‌ ఇండియా’. ప్రముఖ దర్శకుడు హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా, హర్మన్‌ బవేజాలు సంయుక్తగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మన దేశంలో జరిగిన కీలకమైన ఓ రెస్క్యూ ఆపరేషన్‌గా నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో కార్తీక్‌ పైలెట్‌గా నటిస్తున్నాడు. ‘‘మన దేశానికి కీలకమైన చారిత్రక అధ్యాయంలో భాగం అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. హన్సల్‌తో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ని చెప్పాడు కార్తీక్‌. ‘‘ఒక సాధారణమైన పైలెట్‌ వేలాదిమందిని కాపాడటానికి చేసిన అసాధారణ సాహసమే ఈ చిత్రం’’అని చెప్పారు హన్సల్‌ మెహతా. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని