వివాదంపై వివరణ కోరిన కేంద్ర సమాచార శాఖ
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాండవ్’ వెబ్‌సిరీస్‌కు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే సోషల్‌మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న ‘తాండవ్’ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దేవుళ్లను అవమానిస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సిరీస్‌లోని పలు సన్నివేశాలు చిత్రీకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెబ్‌సిరీస్‌పై వెంటనే నిషేధం విధించాలని కోరుతూ ఇటీవల భాజపా ఎంపీ మనోజ్ కటక్.. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు లేఖ రాశారు. అలాగే మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్సారంగ్ కూడా ఈ సిరీస్ ప్రసారం వెంటనే నిలిపివేయాలని జావడేకర్కు లేఖ పంపారు. దీంతో ‘తాండవ్’ వివాదంపై అమెజాన్ ప్రైమ్ వెంటనే వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార శాఖ కోరింది. ఈ క్రమంలోనే తాజాగా ‘తాండవ్’ మేకర్స్, అమెజాన్ ప్రైమ్‌పై ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ను అలీ అబ్బాస్ జాఫర్ చిత్రీకరించారు. డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, గౌహర్‌ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా దీనిని విడుదల చేశారు. ప్రస్తుతం ‘తాండవ్’కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదీ చదవండి
సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్