AP News: మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారం.. అశోక్‌ గజపతిరాజుపై కేసు నమోదు - case filed against to ashok gajapatiraju
close
Updated : 22/07/2021 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారం.. అశోక్‌ గజపతిరాజుపై కేసు నమోదు

విజయనగరం: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల ఈనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్‌ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈక్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి..  కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛైర్మన్‌, కరస్పాండెంట్‌ సహా 10మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని