Tollywood: ‘ఇప్పుడుకాక ఇంకెప్పుడు’ మూవీపై కేసు నమోదు - case files on ippudu kaaka inkeppudu moviea
close
Published : 04/08/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ‘ఇప్పుడుకాక ఇంకెప్పుడు’ మూవీపై కేసు నమోదు

హైదరాబాద్‌: ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. యువ నటీనటులు హస్వంత్ వంగ , నమ్రతా దరేకర్ , వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో వై .యుగంధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓ శృంగార సన్నివేశంలో భజగోవిందం అనే పాట పలువురి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని భావించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందూ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు.  67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ కింద కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు.

కాగా, దీనిపై దర్శకుడు యుగంధర్‌ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ విషయంలో ఒక పొరపాటు జరిగింది. అది కావాలని చేసింది కాదు. ఈ సినిమాలో ఉన్న ఇంకొక పాటలోని బ్యాగ్రౌండ్‌ స్కోరును తీసుకొచ్చి, ట్రైలర్‌లో రాంగ్‌ ప్లేస్‌లో పెట్టడం వల్ల ‘భజగోవింద’ అనే మాట ప్లే అయింది. నేనూ గమనించలేదు. అందుకు క్షమాపణలు కోరుతున్నా. ఏదైనా పొరపాటు పొరపాటే. ఆ పదాన్ని తొలగించాం’’ అని అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని