రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై 22న విచారణ - cbi special court accepts mp raghu ramakrishna raju petition
close
Published : 16/04/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై 22న విచారణ

దిల్లీ: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని.. ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించి వేగంగా విచారణ చేపట్టాలని కోరుతూ రఘురామకృష్ణరాజు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌తో పాటు అనుబంధ దస్త్రాలు సరిగా లేనందున విచారణార్హం కాదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. తాజాగా కోర్టు పేర్కొన్న అభ్యంతరాలపై వివరణ ఇస్తూ మరిన్ని దస్త్రాలు సమర్పించడంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 22న పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సీబీఐ న్యాయస్థానం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని