సామాజిక రోగనిరోధక శక్తికి దగ్గరలో..  - ccmb director rakesh mishra on on herd immunity
close
Published : 13/03/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సామాజిక రోగనిరోధక శక్తికి దగ్గరలో.. 

-  టీకాలతో మరింత వేగంగా  చేరుకోవచ్చు

-  ‘ఈనాడు’తో సీసీఎంబీ   డైరెక్టర్‌ డా.రాకేశ్‌ మిశ్ర

ఈనాడు, హైదరాబాద్‌: జనాభాలో 60 శాతం మందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉంటే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించినట్లేనని, ఎంత ఎక్కువ మంది టీకాలు తీసుకుంటే అంత వేగంగా ఆ శక్తికి చేరుకోగలమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఆ ప్రకారం వీరు వ్యాధిని వ్యాప్తి చేయరని, అంటువ్యాధి అదుపులో ఉంటుందని చెప్తున్నారు. సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ), జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సీరో సర్వేలో 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటిబాడీలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. నగర జనాభాలో సుమారు సగం మందికి కరోనా వచ్చిపోయినట్లు అంచనా కట్టారు. ఆ ప్రకారం.. హెర్డ్‌ ఇమ్యూనిటీకి మనం 60 శాతానికి మరో 6 శాతం దూరంలోనే ఉన్నామని తేల్చారు. అయితే.. అంటువ్యాధి సంక్రమణను బట్టి ఇది మారుతుందని.. 60 నుంచి 90 శాతం జనాభాలో వ్యాధిని తట్టుకునే శక్తి ఉంటే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించినట్లేనని పరిశోధకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో వైరస్‌ వ్యాప్తి, తీవ్రత తక్కువగా ఉండటంతో పాటు 80 శాతం మందిలో కొవిడ్‌ను తట్టుకునే సామర్థ్యం వచ్చిందని ఇటీవలి సీరో సర్వేలో వెల్లడైంది. ఎలా చూసినా రాజధాని నగరం సామాజిక వ్యాధి రోగనిరోధక శక్తికి చేరువలో ఉంది. ఎక్కువ మంది టీకాలు వేయించుకోవడం ద్వారా ఒకటి రెండు నెలల్లో మనం హెర్డ్‌ ఇమ్యూనిటీ దశకు చేరుకుంటామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర ‘ఈనాడు’తో అన్నారు. ఇదే సమయంలో కొత్త వైరస్‌లేవీ సోకకుండా ఉండటమూ ప్రధానమేనని ఆయన చెప్పారు. 

ఆలస్యానికి కారణమిది..

మన దగ్గర హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధనకు ఒకటిరెండు నెలలు పడుతుందనడానికి శాస్త్రవేత్తలు కారణాలు చూపుతున్నారు. జనవరి తొలివారంలో నిర్వహించిన యాంటీబాడీ పరీక్షల్లో కొన్ని ప్రాంతాల్లో 70 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఏర్పడితే.. కొన్నిచోట్ల అత్యల్పంగా 30 శాతం మందిలోనే అవి కన్పించాయి. వీరిలో యాంటిబాడీలు 60 శాతం దాటితేనే సామాజిక వ్యాధి రోగనిరోధక శక్తి వస్తుందని డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు. ఇటీవలి పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువమందిలో కొవిడ్‌ లక్షణాలు సైతం కన్పించడం లేదని, దీనిపై ఆందోళన అవసరం లేదని ఆయన తెలిపారు. సిరో సర్వే జరిపినప్పుడు 75 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు కూడా తెలియదనే విషయం వెల్లడైందని ఆయన ప్రస్తావించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని