సీఈసీ సుశీల్‌ చంద్రకు కరోనా - cec sushil chnadra test positive for covid
close
Updated : 20/04/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఈసీ సుశీల్‌ చంద్రకు కరోనా

ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు కూడా..

దిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సుశీల్‌ చంద్ర కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు కూడా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈసీ అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

వారం రోజుల క్రితమే సుశీల్‌ చంద్ర సీఈసీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గత సోమవారం సునీల్‌ అరోడా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం సుశీల్‌ను నియమించింది. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో అరోడా పదవీ విరమణతో సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌ ఇద్దరే ఉన్నారు. వీరిద్దరికీ వైరస్‌ సోకినట్లు ఈసీ అధికారులు తాజాగా వెల్లడించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని