close
Published : 08/03/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డ్యాన్స్‌తో ఫిదా చేస్తోన్న సామ్‌

ప్రముఖుల ప్రశంసలు.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత అక్కినేని తన డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తున్నారు. ‘డోంట్‌ రష్‌’ అనే హాలీవుడ్‌ ప్రైవేట్‌ ఆల్బమ్‌కు సెలబ్రిటీ కొరియోగ్రాఫర్‌ అనూష స్వామితో కలిసి ఆమె స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోని సామ్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘విక్కీకౌశల్ దీనిని మేము చేయగలిగేలా చేశాడు. ఈ అద్భుతమైన మహిళ అనూషకు నా ప్రశంసలు. అనూష.. ఒక ఏడాది సమయం ఇస్తే.. డ్యాన్స్‌లో నేను నీ స్థాయిని చేరుకోగలుగుతాను’’ అని సమంత పేర్కొన్నారు.

కాగా, సామ్‌ షేర్‌ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌ చూసి సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ‘సామ్‌.. చాలా అద్భుతంగా డ్యాన్స్‌ చేశావు. రిపీట్‌ మోడ్‌లో నీ వీడియోనే చూస్తున్నాను’ అని ఉపాసన రిప్లై ఇచ్చారు. నందినా రెడ్డి, దియామీర్జా, లావణ్య త్రిపాఠి, విమలా రామన్‌, సుశాంత్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, గీతామాధురి, చిన్మయి తదితరులు సమంతపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ చేసిన ‘డోంట్‌ రష్’ ఛాలెంజ్‌లో భాగంగా సమంత ఈ డ్యాన్స్‌ చేశారు.



CMHgAH3gXjg

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని