ఛాలెంజ్‌ చేస్తోన్న సెలబ్రిటీలు..! - celebrities in dont rush challenge
close
Updated : 14/03/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛాలెంజ్‌ చేస్తోన్న సెలబ్రిటీలు..!

వైరల్‌గా మారిన వీడియోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌లకు కొదవే లేదు. ఫ్యాషన్‌, ఫొటోషూట్స్‌, మ్యూజిక్‌, కుకింగ్‌, ఇలా వివిధ అంశాలకు సంబంధించి తరచూ మనం ఎన్నో సరదా ఛాలెంజ్‌లను చూస్తూనే ఉన్నాం. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన ‘మేకప్‌ నో మేకప్‌ లుక్స్‌‌’, ‘పిల్లో’, ‘ఫ్లిప్‌ ది స్విచ్‌’ ఛాలెంజ్‌లు అటు సెలబ్రిటీలు, ఇటు సినీ ప్రియుల మది దోచాయి. సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ కోవలోనే తాజాగా వచ్చిన ‘డోన్ట్‌ రష్‌’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హాలీవుడ్‌ ప్రైవేటు ఆల్బమ్‌ ‘డోన్ట్‌ రష్‌’ రీమిక్స్ వెర్షన్‌కు సినీతారలు, నెటిజన్లు.. తమదైన శైలిలో కాలు కదిపి ప్రతి ఒక్కరి చూపు తమవైపు తిప్పుకుంటున్నారు.

‘డోన్ట్‌ రష్‌’ ఛాలెంజ్‌కు సంబంధించి వచ్చిన వీడియోల వల్ల స్ఫూర్తి పొందిన బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ మొదటిసారి ఇన్‌స్టా వేదికగా తన డ్యాన్స్‌ వీడియోని షేర్‌ చేశారు. ఆయన డ్యాన్స్‌ చూసి ఫిదా అయిన అగ్రకథానాయిక సమంత.. ఇటీవల షేర్‌ చేసిన వీడియో ఆకట్టుకుంది. ఇక, నటీమణులు లావణ్య త్రిపాఠి, శ్రద్ధాదాస్‌, పూనమ్‌ బజ్వా, ‘దంగల్‌’ నటి ఫాతిమా, అమైరా దస్తుర్‌, తనుశ్రీ దత్‌‌‌, బుల్లితెర నటీమణులు హీనాఖాన్‌, నియా శర్మ, హారిక.. ఇలా చెప్పుకుంటూ వెళితే పలువురు నటీనటులు తమదైన స్టైల్‌తో నెట్టింట్లో ట్రాఫిక్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీంతో ఆయా నటీమణుల వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని