కలలన్నీ నిజం కావాలి.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావాలి..! - celebrities new year wishes
close
Published : 02/01/2021 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలలన్నీ నిజం కావాలి.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావాలి..!

నూతన సంవత్సర వేడుకలు.. తారలు ఇలా..!

హైదరాబాద్‌: 2021.. కొత్త ఏడాది.. కొత్త దశాబ్దం ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ పలువురు తారలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సానుకూల దృక్పథంతో ముందడుగు వేద్దామని.. రాబోయే కాలమంతా ఎన్నో విజయాలను అందజేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా తమ న్యూఇయర్‌ వేడుకలకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు.

‘థ్యాంక్యూ 2020.. మాకు ఓర్పును నేర్పావు. మా జీవితాలు మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్‌కమ్‌ టు ది న్యూ ఇయర్‌. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి. బోలెడంత సంతోషాన్నివ్వాలి. మీ కలలన్నీ నిజం కావాలి. అలాగే కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా రావాలి. మీకు మీ ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ - చిరంజీవి


‘మనం గతంలో వదిలిపెట్టిన దానికంటే ఎన్నో మంచి విషయాలు మన కోసం భవిష్యత్తులో రానున్నాయి. సహనం, స్నేహం, కృతజ్ఞతలు.. ఇలా 2020 మనకి ఎన్నో విషయాలను నేర్పించింది. అందరికీ ఆయురారోగ్యాలు, సంతోషం మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ - నమ్రత శిరోద్కర్‌


‘2021లో ఇదే మొదటి ఉషోదయం. ప్రతిఒక్కరికీ సంతోషం, విజయం వరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఏడాది అందరికీ మంచే జరగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌’ - అక్షయ్‌ కుమార్‌


‘నా ప్రియమైన జీవితభాగస్వామితో కలిసి 2021 మొత్తాన్ని సంతోషంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రేమ, కుటుంబం, స్నేహితులు, ప్రయాణం, దైవభక్తి, వృత్తిపరంగా ఎదుగుదల.. ఇలా ఎన్నో మంచి విషయాలతో ఈ ఏడాది ఉండాలని కోరుకుంటున్నాను. మన జీవితాల్లో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను’ - సోనమ్‌ కపూర్‌


‘మంచి లేదా చెడు..!! ఏదైనా కార్యం పూర్తి కావడం కోసం నిలబడితే నువ్వు మనిషిని అవుతావు. నమ్మినదాని కోసం పోరాటం చేస్తే సాధారణ మనిషి నుంచి సైనికుడిగా మారతావు. కాబట్టి ఈ కొత్త ఏడాదిలో మీలో ఉన్న భయాలను జయించి కొత్త వ్యక్తిలా మీరు రూపాంతరం చెందాలని కోరుకుంటున్నా’ - నాగబాబు


‘నాకు నిత్యం ఆనందాన్ని, మానసిక బలాన్ని అందిస్తున్న నా కుటుంబం, నా మిత్రులు, నా నిర్మాతలు, నా దర్శకులు అలాగే అందరికంటే ముఖ్యంగా నా అభిమానులకు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నాను. 2020 మనందరికీ భరించలేని కష్టాల్ని పరిచయం చేసింది. కానీ మనందరం రెట్టింపు బలంతో ముందుకు సాగటానికి సిద్ధం అయ్యాం. మనందరి బంధం మరింత దృఢంగా మారాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ - రామ్‌చరణ్‌


‘మిగిలిన సంవత్సరాలతో  పోలిస్తే 2020 ఎంతో విభిన్నమైనది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మనందరం ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. సవాళ్లను స్వీకరించి నాలుగు గోడలకే పరిమితమయ్యాం. ప్రియమైన వారికి చేరువయ్యాం. 2020లో నన్ను నేను ఎంతగానో అర్థం చేసుకున్నాను. అందరిలాగే నేను కూడా భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా. కొత్త ఏడాదిలో అందరికీ మంచే జరగాలని ఆశిస్తున్నా’ - వరుణ్‌ తేజ్‌


‘హ్యాపీ న్యూ ఇయర్‌.. ఈ ఏడాది మొత్తం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషామే ఉండాలని కోరుకుంటున్నా’ - కాజల్‌ అగర్వాల్‌


‘ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతేడాది మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ ఏడాది అంతా మంచే జరగాలని ఆశిద్దాం’ - శుత్రిహాసన్‌


ఇదీ చదవండి

కొత్త ఏడాదిలో సరికొత్త సినిమాలు వచ్చేస్తున్నాయ్‌..!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని