ప్రకృతి కోపానికి నిదర్శనమిది - celebrities responding on uttarakhand incident
close
Published : 08/02/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకృతి కోపానికి నిదర్శనమిది

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆదివారం జలప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. 14 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజాగా ఈ ప్రమాదంపై బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ప్రముఖులు స్పందించారు. త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని, బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ మేరకు ‘#ఉత్తరాఖండ్‌’ అంటూ ట్విటర్‌ ద్వారా తమ సానుభూతిని వ్యక్తం చేశారు. 

మేమంతా మీకు బాసటగా ఉంటాం(బాధితులను ఉద్దేశించి) - సోనూసూద్‌

ఉత్తరఖండ్‌లో జరిగిన ఈ ఘోరప్రమాదం గురించి తెలియగానే ఎంతో బాధపడ్డాను. అందరూ క్షేమంగా ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. -శ్రద్ధాకపూర్‌

 

హిమలయాల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆనకట్టలు నిర్మించడమే ఈ ఘటనకు కారణమైంది. అక్కడి ప్రకృతిని నాశనం చేసి భవనాలు నిర్మిస్తున్నారు. దీనివల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. చమోలీ ప్రాంత ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. బాధితులు సహాయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ ఫోన్‌ నెంబర్లు 1070 లేదా 95574 44486 కి కాల్‌ చేయండి.  -దియా మిర్జా

 

అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. -సిద్దార్థ్‌ మల్హోత్రా

 

ప్రమాద బాధితులంతా సురక్షితంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. -కరీనా కపూర్‌ ఖాన్‌

 

ప్రమాద బాధితులైన చమోలీ ప్రాంత ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులకు, రెస్క్యూ సిబ్బందికి మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను.(హెల్ప్‌ లైన్‌ నెంబర్లు షేర్‌ చేశారు) -సారా అలీఖాన్‌

 

ఉత్తరాఖండ్‌ ప్రమాద దృశ్యాలు చూసి ఎంతో కలత చెందాను. ప్రకృతి ప్రకోపిస్తే ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి. ప్రమాద ప్రాంతంలోని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సహాయక సిబ్బందికి మరింత బలం చేకూరాలని, అందరిని రక్షించాలని కోరుకుంటున్నాను. -మంచు లక్ష్మి

 

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు అడివిశేష్‌ స్పందిస్తూ ‘మనమింకా మెరుగుపడాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రమాద దృశ్యాన్ని షేర్‌ చేశారు.                                                             

 

ఇవీ చదవండి!

ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం పంత్‌ ముందడుగు

ఉత్తరాఖండ్‌ జల ప్రళయానికి కారణమేంటి? 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని