నవ్వు ఆపుకోలేని బన్నీ: సుమ-సుధీర్‌ సందడి - celebrities social media account round up
close
Published : 25/10/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వు ఆపుకోలేని బన్నీ: సుమ-సుధీర్‌ సందడి

సోషల్‌ లుక్‌: మన తారలు పంచుకున్న విశేషాలు..

* స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నవ్వు ఆపుకోలేకపోయారు. శుక్రవారం సాయంత్రం పార్టీని బాగా ఎంజాయ్‌ చేశానంటూ.. అయాన్‌, అర్హ డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. 

* యువ కథానాయకుడు సుశాంత్‌ నటిస్తున్న సినిమా ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’. శనివారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని సుశాంత్‌ పేర్కొన్నారు.

* యాంకర్లు సుమ, సుధీర్‌ కలిసి సందడి చేశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ సుమ వీడియో పంచుకున్నారు. ‘ఈ పండగని మరింత ప్రత్యేకంగా చేయడానికి వచ్చేశాం. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న వీడియోతో..’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.
* పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 12 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘అందరికీ ధన్యవాదాలు. గత నాలుగేళ్లుగా సోషల్‌మీడియాలో మీరు నాపై కురిపిస్తున్న ప్రేమను మాటల్లో వర్ణించలేకపోతున్నా. నేను చేరుకోవాల్సిన గమ్యం ఇంకా చాలా ఉంది. నా అభిమానులకు రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.

* కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా..!’. ఈ సినిమాలో లావణ్య ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆమె ‘మల్లిక’ అనే పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని