ప్రభాస్‌ ఫొటో వైరల్.. ట్రెండింగ్‌లో కియారా డ్యాన్స్‌ - celebrities social media accounts round up
close
Published : 17/09/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ఫొటో వైరల్.. ట్రెండింగ్‌లో కియారా డ్యాన్స్‌

సోషల్‌ లుక్‌: మన తారలు ఏం షేర్‌ చేశారంటే..?

హైదరాబాద్‌: కథానాయిక శ్రద్ధా కపూర్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించారు. మూడు మెక్కల్ని నాటారు. మరోపక్క నటుడు ఆది పినిశెట్టి మూగజీవుల్ని ఆదుకుని.. నెటిజన్ల మన్ననలు పొందారు. వీధి కుక్క పిల్లల్ని సంరక్షించి, పాలు తాగిస్తున్న వీడియోను ఆయన షేర్‌ చేశారు.

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా భర్త నిక్‌ జొనాస్‌ బుధవారం పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఫొటోలు, వీడియోల్ని కలిపి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. కొణిదెల కోడలు ఉపాసన తన భర్త రామ్‌చరణ్‌ తీసిన ఫొటోను షేర్‌ చేశారు. అతిగా ఆలోచించడం వల్ల ఆనందాన్ని కోల్పోతామన్నారు. విశాల్‌ తండ్రి జీకే రెడ్డి ఫిట్‌నెస్‌ పాఠాలు చెబుతూ.. తన కసరత్తుల వీడియోను షేర్‌ చేశారు. 82 ఏళ్ల ఆయన ఫిట్‌నెస్‌ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరోపక్క ప్రభాస్‌ క్లాసీ లుక్‌లో ఉన్న కొత్త ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అదేవిధంగా నటి కియారా అడ్వాణీ నటిస్తున్న కొత్త సినిమా ‘ఇందూకీ జవానీ’. బుధవారం విడుదల చేసిన ఈ సినిమాలోని గీతాన్ని నటి షేర్‌ చేశారు. కియారా అడ్వాణీ తెగ చిందేస్తున్న వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఆమె డ్యాన్స్‌ను ట్విటర్‌లో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలా మన తారలు తాజాగా పంచుకున్న విశేషాలు మీ కోసం..













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని