సోషల్‌ లుక్‌: నమ్మలేకపోతున్న చెర్రీ.. అదా స్టంట్స్‌ - celebrities social media accounts round up
close
Published : 29/09/2020 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: నమ్మలేకపోతున్న చెర్రీ.. అదా స్టంట్స్‌

* తన తొలి సినిమా ‘చిరుత’ విడుదలై, 13 ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నానని రామ్‌చరణ్‌ తెలిపారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయన్నారు. తనను ప్రేమించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

* వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వీధి కుక్కలకు జబ్బు చేయకుండా టీకాలు వేస్తున్నారు. ఈ మేరకు ‘సేవ్‌శక్తి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆమే కుక్కలకు టీకాలు వేస్తున్నారు.

* అలియా భట్‌ తన స్నేహితుడు రణ్‌బీర్‌ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఫొటో షేర్‌ చేశారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

* సమంత తన దుస్తుల బ్రాండ్‌ ‘సాకి’ని అధికారికంగా సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున తన కోడలికి శుభాకాంక్షలు తెలిపారు.

* అదా శర్మ ఓ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తీసిన వీడియోను షేర్‌ చేశారు... ఇలా మన తారలు ఫాలోవర్స్‌తో పంచుకున్న ఆసక్తికర విషయాలు మీ కోసం..

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని