సోషల్‌ లుక్‌: బ్రహ్మీ స్కెచ్‌.. సుమ సరదా - celebrities social media accounts round up
close
Updated : 03/10/2020 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: బ్రహ్మీ స్కెచ్‌.. సుమ సరదా

* ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మహాత్మా గాంధీ స్కెచ్‌ గీశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

* తన సినిమా ‘నిశ్శబ్దం’ విడుదల సందర్భంగా నటి అనుష్క ఇంట్లో తీసుకున్న ఫొటో షేర్‌ చేశారు. తన చిత్రం ఓటీటీలో విడుదల కావడం ఉత్సుకతగా ఉందన్నారు.

* కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్‌’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. రిమోట్‌, కోక్‌.. అన్నీ సిద్ధంగా ఉంచుకోమని.. సినిమా విడుదల కాబోతోందని పేర్కొన్నారు.

* కథానాయిక ప్రియాంకా చోప్రా తన జీవితం ఆధారంగా పుస్తకం రాశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ కవర్‌ ఫొటో షేర్‌ చేశారు.

* యాంకర్‌ సుమ తన పెంపుడు కుక్కతో కాలక్షేపం చేస్తున్నారు. షూటింగ్స్‌ లేనప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటానని సరదాగా అన్నారు.

* కథానాయకుడు రామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్స్‌ సంఖ్య 2 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా ‘మీరే నా ఎనర్జీ’ అంటూ ఫొటో షేర్‌ చేశారు. ఇలా తాజాగా మన తారలు పంచుకున్న  విశేషాలు మీకోసం..


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని