సితార ఉంగరం.. నభా పెయింటింగ్.. రష్మిక వర్కౌట్స్‌ - celebrities social media accounts round up
close
Published : 10/10/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సితార ఉంగరం.. నభా పెయింటింగ్.. రష్మిక వర్కౌట్స్‌

సోషల్‌లుక్‌: మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర పోస్ట్‌లు

* కథానాయిక నభా నటేష్‌ బ్యాట్‌మెన్‌కు పెద్ద అభిమాని. అందుకే ఎంతో కష్టపడి బ్యాట్‌మెన్‌ పెయింటింగ్‌ వేశారు.

* 24 గంటల్లో ఒక్క గంటను మన శరీరం కోసం కేటాయించాలని కథానాయిక రష్మిక సూచించారు. అలా చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని కచ్చితంగా పొందుతారని వ్యాయామం చేస్తున్న వీడియో పంచుకున్నారు. అదే విధంగా శ్రద్ధా కపూర్‌, లావణ్య త్రిపాఠి కూడా వర్కౌట్స్‌ వీడియోలు షేర్‌ చేశారు.

* దర్శకుడు వి.వి. వినాయక్‌ పుట్టినరోజు సందర్భంగా కథానాయకుడు రామ్‌ చరణ్‌ ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక బహుమతి కూడా అందించారు.

* తన తల్లి నమ్రత అరుదైన కానుక ఇచ్చిందంటూ సితార చెప్పింది. ‘నా దీపావళి కానుకను ముందే అందుకున్నా. అమ్మ నాకు సాయిబాబా ఉంగరం ఇచ్చింది. దీన్ని ఇలానే ఎప్పటికీ నా చేతి వేలికి ఉంచుకోవాలని చెప్పింది. అమ్మకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాంటి సాయిబాబా ఉంగరాన్ని ఆమెకు ఇచ్చారట. దాన్ని అమ్మ ఇప్పటికీ అలానే వేలికి ఉంచుకుంది. ఇప్పుడు నా వంతు..’ అని సితార పోస్ట్‌ చేసింది.

* కథానాయిక శ్రుతి హాసన్‌ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థిగా తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తన పాఠశాల ఎన్నో మధుర జ్ఞాపకాల్ని, స్నేహితుల్ని ఇచ్చిందని పేర్కొన్నారు.. ఇలా మన తారలు పంచిన విషయాలు మీ కోసం..



















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని