సోషల్‌లుక్‌: తరుణ్‌ వేడుకలు: వానచినుకుల్లో రామ్‌ - celebrities social media accounts round up
close
Published : 14/10/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌లుక్‌: తరుణ్‌ వేడుకలు: వానచినుకుల్లో రామ్‌

* తను కథానాయకుడిగా పరిచయమైన సూపర్‌హిట్‌ సినిమా ‘నువ్వే కావాలి’ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తరుణ్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

* కథానాయకుడు రామ్‌ హైదరాబాద్‌ వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. వాన చినుకుల్లో ఇష్టంగా తడుస్తున్న వీడియోను మంగళవారం షేర్‌ చేశారు.

* ప్రముఖ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కిశోర్‌ కుమార్‌ వర్థంతి సందర్భంగా కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా నివాళులర్పించారు. గాయకుడిగా మారి.. హిందీ గీతం ఆలపించారు.

* అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్స్‌ సంఖ్య 40 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

* తన అన్నయ్య రమేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణగా ఉండటం, అంకితభావంతో పనిచేయడం వంటి కొన్ని గుణాల్ని ఆయన నుంచి నేర్చుకున్నానని తెలిపారు.

* ప్రముఖ జిమ్‌ ట్రైనర్‌ నమ్రతా పురోహిత్‌ నటి జాన్వి కపూర్‌ కసరత్తుల వీడియోను షేర్‌ చేశారు. తమ రోజు ఇలా ప్రారంభమైందని తెలిపారు. ఇలా మన తారలు పంచుకున్న విశేషాలు చూడండి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని