సోషల్‌ లుక్‌: విష్ణు కోసం వెంకీ.. అదాకు ఫిదా - celebrities social media accounts round up
close
Published : 17/10/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: విష్ణు కోసం వెంకీ.. అదాకు ఫిదా

సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు..

* మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ సినిమాకు విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా విష్ణు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ‘నీతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది విష్ణు..’ అని వెంకీ రిప్లై ఇచ్చారు.

* ‘మాస్కు చేతికి కాదు.. మూతికి.. దాన్ని సక్రమంగా వేసుకోండి..’ అని సూచించారు యాంకర్‌ సుమ. ఈ మేరకు ఓ వీడియోను షేర్‌ చేశారు. అంతేకాదు తప్పకుండా ఆవిరి పట్టుకోమని కూడా పేర్కొన్నారు.

* కార్తి తన కొత్త సినిమా ‘సుల్తాన్‌’ డబ్బింగ్‌ ప్రారంభించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ ఫొటోలు షేర్‌ చేసింది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.

* నటి అదా శర్మ మరోసారి తన డ్యాన్స్‌తో ఫాలోవర్స్‌ను ఫిదా చేశారు. సాయిపల్లవి, ధనుష్‌ జంటగా నటించిన ‘రౌడీ బేబీ’ పాటకు తన స్టైల్‌లో స్టెప్పులేసి వీడియో షేర్‌ చేశారు.

* కథానాయకుడు నాగశౌర్య కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. అనీశ్‌ కృష్ణ దీనికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. ఐరా ప్రొడక్షన్స్‌ పతాకంపై నాగశౌర్య తల్లి ఉష దీన్ని నిర్మించబోతున్నారు.

* బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ గత పదేళ్లుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నారట. ఎంతో మంది వైద్యులను సంప్రదించానని, తప్పకుండా శస్త్ర చికిత్స చేసుకోవాలి అన్నారని తెలిపారు. కానీ డాక్టర్‌ ముల్లెర్‌ మాత్రం తగిన వ్యాయామంతో తన నొప్పిని తగ్గించారని ఫొటోలు షేర్‌ చేశారు.




















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని