సోషల్‌ లుక్‌: అనుష్క ఆనందం.. రాశీ చీటింగ్‌ - celebrities social media accounts round up
close
Published : 20/10/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: అనుష్క ఆనందం.. రాశీ చీటింగ్‌

 తారలు పంచుకున్న విశేషాలు..

* ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు శుభాకాంక్షలు చెప్పారు. షూటింగ్‌ సెట్‌ను సౌకర్యవంతంగా, సరదాగా ఉంచే నిర్మాత ఆయనని.. అలా చేయడం సులభం కాదని పేర్కొన్నారు.

* నటి ఐశ్వర్య రాజేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సినిమా ‘భూమిక’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తమన్నా, జయం రవి విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా తెరకెక్కనుంది. 

* క్రికెట్‌ టోర్నీ కోసం విరాట్‌ కోహ్లీతో పాటు యూఏఈ వెళ్లిన అనుష్క అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. త్వరలో తల్లి కాబోతున్న ఆమె అక్కడి పచ్చని చెట్ల మధ్య సూర్య కిరణాలు తనువును తాకుతుండగా తీసిన చక్కటి ఫొటోలను పంచుకున్నారు.

* ‘డేవిడ్ అటెన్బొరఫ్: ఎ లైఫ్‌ ఆన్‌ అవర్‌ ప్లానెట్‌’ డ్యాక్యుమెంటరీని ప్రతి ఒక్కరూ చూడాలని కథానాయిక సమంత కోరారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కావాల్సిన ఎన్నో విషయాలు అందులో ఉన్నాయన్నారు.

* అశోక్‌ సెల్వన్‌, నిత్యా మేనన్‌, రితూ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిన్నిలా నిన్నిలా’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారని, కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నిత్య తెలిపారు. 























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని