సోషల్‌ లుక్‌: ఇంటిపనుల్లో కాజల్‌.. పెళ్లిలో కంగన - celebrities social media accounts round up
close
Published : 22/10/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: ఇంటిపనుల్లో కాజల్‌.. పెళ్లిలో కంగన

మన తారలు షేర్‌ చేసిన విశేషాలు

* బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన కజిన్‌ కరణ్‌ వివాహ వేడుకలో సందడి చేశారు. అంజలి తమ ఇంటికి కోడలిగా రావడం సంతోషంగా ఉందని, కానీ ఆమె తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉందన్నారు. ఇవాళ వారి హృదయంలోని ఓ భాగాన్ని తమకిచ్చారని, అంజలి గది ఖాళీగా ఉండబోతోందంటూ వీడియో షేర్‌ చేశారు.

* సాయి తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకుడు. నభా నటేష్‌ కథానాయిక. ఈ సినిమాకు యూ సర్టిఫికెట్‌ వచ్చినట్లు సాయితేజ్‌ ప్రకటించారు.

* మరికొన్ని రోజుల్లో పెళ్లి కాబోతున్న నేపథ్యంలో కాజల్‌ తన కొత్త ఇంటిని చక్కదిద్దుతున్నారు. ఎలా అలంకరిస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వండని ఫొటో షేర్‌ చేశారు. అంతేకాదు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ పంపిన కానుకను కూడా షేర్‌ చేశారు.

* బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ బెంగళూరులో తన వ్యాయామశాలను ప్రారంభించారు. ఈ విషయాలన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటో షేర్‌ చేశారు.

* కథానాయిక కృతి సనన్‌ ఇంట్లోనే తెగ కసరత్తులు చేస్తున్నారు. మనలో స్ఫూర్తి రావడానికి రోజు, సమయంతో పనిలేదని క్యాప్షన్‌ ఇచ్చారు.

* రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అరణ్య’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని