సోషల్‌ లుక్‌: సామ్‌@12M.. జ్ఞాపకాల్లో నాగబాబు - celebrities social media accounts round up
close
Updated : 15/09/2020 06:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: సామ్‌@12M.. జ్ఞాపకాల్లో నాగబాబు

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 12 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా ఆమె ఫొటోను షేర్‌ చూస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. నటుడు నాగబాబు అరుదైన ఫొటోను అనుచరులతో పంచుకుని.. ఒకప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ కరచాలనం చేసుకుంటున్న ఆ చిత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరోపక్క నటి రేణూ దేశాయ్‌ తను రైతులపై తీస్తున్న సినిమాకు పాటలు రాయించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గోరేటి వెంకన్న వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ వారి సాధారణ జీవితం ఎంతో నచ్చిందని పేర్కొన్నారు.

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ సాగర తీరంలో సమయం గడిపారు. చాలా రోజుల తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చానని, చూసేంత దూరంగా మనుషులు లేరని అన్నారు. కేవలం ఫొటోలకు మాత్రమే మాస్కులు తీసినట్లు చెప్పారు. అదేవిధంగా నటి త్రిష తన చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేశారు. తన ముఖం అందంగా ఉన్నా.. ఆలోచనలు మాత్రం భయంకరంగా ఉంటాయని ఫన్నీగా అన్నారు.

కథానాయకుడు సుధీర్‌బాబు తను నటించిన ‘వి’ సినిమాలోని ‘బేబీ టచ్‌ మి నౌ..’ పాటకు చిందేశారు. ఆడియో లేకుండా ఆయన డ్యాన్స్‌ చేయడం విశేషం. ఇలా సోషల్‌మీడియా వేదికగా మన తారలు పంచుకున్న విశేషాలు చూద్దాం.. 















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని