close

తాజా వార్తలు

Published : 27/10/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయ్‌ ఇంటికొస్తే.. కుమార్తెతో యశ్‌ ఆటలు

సోషల్‌లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు

* యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ యూరప్‌ ట్రిప్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ వచ్చారు. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆయనపై పెంపుడు కుక్క అమితమైన ప్రేమను చూపించింది. ఈ సందర్భంగా తీసిన చక్కటి వీడియోను విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

* కథానాయకుడు యశ్‌ కుమార్తె ఆయనకు పెట్టకుండా ఐస్‌క్రీమ్‌ తినేస్తోందట. ఏ విషయంలోనైనా షేరింగ్‌ ఉంటుంది కానీ ఐస్‌క్రీమ్‌ మాత్రం షేర్‌ చేయదని యశ్‌ అన్నారు. ఆయన షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది.

* బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ బాక్సర్‌గా మారారు. ఆయన పంచ్‌లకు ఫాలోవర్స్‌తోపాటు నటుడు టైగర్‌ ష్రాప్‌ కూడా ఫిదా అయ్యారు.

* నటుడు సుశాంత్‌ తన తర్వాతి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మేకింగ్‌ వీడియో షేర్‌ చేశారు. యాక్షన్‌ సన్నివేశాలను అందులో చూపించారు.

* ప్రముఖ నటి రవీనా టాండన్‌ ‘కేజీఎఫ్‌ 2’లో పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘రమికా సేన్‌’గా కనిపించబోతున్నారు.
















Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.