సోషల్‌ లుక్‌: చెఫ్‌ పూజ బ్యాక్‌.. కీర్తి సంగీత కళలు - celebrities social media round up
close
Published : 13/09/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: చెఫ్‌ పూజ బ్యాక్‌.. కీర్తి సంగీత కళలు

మన తారలు ఏం చెబుతున్నారో చూడండి..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కాలాన్ని మన సినీ తారలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కథానాయిక కీర్తి సురేశ్‌ తన సంగీత కళలకి మెరుగులు దిద్దుతున్నారు. పూజా హెగ్డే చెఫ్‌గా మారి తన తండ్రికి రుచికరమైన ఆహారం వండారు. సుధీర్‌బాబు తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను తెలుపుతూ ఓ పోస్ట్‌ చేశారు. ‘వి’ సినిమా చూసిన తర్వాత తన తండ్రి స్పందన భావోద్వేగానికి గురి చేసినట్లు చెప్పారు. మరోపక్క ప్రియాంకా చోప్రా జుట్టు కత్తిరించుకుని కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.

తన తొలి తెలుగు సినిమా ‘కిలాడి కృష్ణుడు’ విడుదలై శనివారంతో 40 ఏళ్లు పూర్తయిందని ప్రముఖ నటి విజయశాంతి గుర్తు చేసుకున్నారు. తనను తెలుగు సినిమాకు పరిచయం చేసిన కృష్ణ, విజయనిర్మలకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా
నటి బిపాసా బసు నెటిజన్లకు సౌందర్య చిట్కాలు చెప్పారు. ఉల్లిపాయ రసం జుట్టుకు రాసుకుని గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుందని, ఒత్తుగా మారుతుందంటూ వీడియోలు షేర్‌ చేశారు. అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో..’ సినిమా ఆల్బమ్‌ 200 మిలియన్‌ స్ట్రీమ్స్‌ దాటింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇలా తాజాగా మన తారలు షేర్‌ చేసిన విశేషాలు చూద్దాం..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని