సోషల్‌ లుక్‌: అప్పట్లో పవన్‌.. ముద్దుగుమ్మల కేక్‌ - celebrities social media round up
close
Published : 14/09/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: అప్పట్లో పవన్‌.. ముద్దుగుమ్మల కేక్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ అరుదైన ఫొటో బయటికి వచ్చింది. ఆయన కాలేజీ చదువుతున్న రోజుల్లో ఆ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఇందులో పవర్‌స్టార్‌ గడుల చొక్కాలో, అమాయకంగా చూస్తూ కనిపించారు. ఈ ఫొటో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. మరోపక్క ‘వి’ సినిమా ఫైట్‌ సన్నివేశం షూట్‌కు ముందు డంబెల్స్‌ ఎత్తుకుని మరింత కసరత్తులు చేస్తున్న ఫొటోల్ని కథానాయకుడు సుధీర్‌బాబు పంచుకున్నారు. అదేవిధంగా నటీమణులు ఆండ్రియా, ఐశ్వర్యరాజేష్‌ రుచికరమైన కేక్‌ తయారు చేశారు. ఇద్దరూ కలిసి పాటలు పాడుకుంటూ, ఒకే ఇంట్లో సమయం గడిపారు.

నటి రితికా ఈ వారానికి సరిపడా వర్కౌట్‌ చేసేశారట. అందుకే ఆనందంతో గెంతులు వేస్తున్న సరదా వీడియో పంచుకున్నారు. నటుడు అనిల్‌ కపూర్‌ బీచ్‌లో పరుగులు తీస్తున్న వీడియోను షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో సముద్రాన్ని మిస్‌ అయ్యానని, ఇప్పుడు ట్రైనర్‌తో కలిసి అక్కడే కసరత్తులు చేస్తున్నానని అన్నారు. నటుడు ప్రియదర్శి తన కొత్త సినిమా షూటింగ్‌ ఆరంభించారు. నటి మంచు లక్ష్మి తన కుమార్తెలో అందం, కొంటెతనం, ఆటపట్టించే గుణం మూడూ ఉన్నాయంటూ వీడియో షేర్‌ చేశారు. ఇలా మన తారలు తాజాగా పంచుకున్న సోషల్‌మీడియా విశేషాలు మీకోసం..
















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని