సోషల్‌ లుక్‌: స్నేహా సేవింగ్‌.. నయన్‌ ఫొటో వైరల్‌ - celebrities social media round up
close
Updated : 19/09/2020 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: స్నేహా సేవింగ్‌.. నయన్‌ ఫొటో వైరల్‌

హైదరాబాద్‌: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా..’ కథానాయిక స్నేహా ఉల్లాల్‌ రోడ్డుపై కనిపించిన ఓ కోడిని ఇంటికి తీసుకెళ్లారు. కాళ్లు కట్టేసి ఉన్న ఆ కోడి ఎక్కడి నుంచో తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి, ఆమె కంటపడింది. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె షేర్‌ చేశారు. తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ పుట్టినరోజును అగ్ర కథానాయిక నయనతార గోవాలో జరిపారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటో వైరల్‌గా మారింది. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ సమంత కూడా కామెంట్‌ చేశారు.

ఇలియానా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. చిన్నతనంలో తెలుపు రంగు గౌనులో అందంగా సిద్ధమైన ఫొటోను షేర్‌ చేశారు. ఆమె క్రిస్టియన్‌ పెళ్లి కుమార్తె గెటప్‌లో ఉన్న ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. నటి రాధిక తన తండ్రితో ఉన్న జ్ఞాపకాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఓ పాత ఫొటోను పంచుకున్నారు.

రానా చాలా రోజుల తర్వాత సోషల్‌ మీడియాలో సెల్ఫీ షేర్‌ చేశారు. మరోపక్క ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా కోసం సందీప్‌ కిషన్‌ సిక్స్‌ప్యాక్‌లో సిద్ధమై.. ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘థింక్‌ లైక్‌ ఏ మాంక్‌’ పుస్తకం తనకు ఎంతో నచ్చిందంటూ మహేశ్‌బాబు ఫొటోను షేర్‌ చేశారు. ఇలా మన తారలు తాజాగా పంచుకున్న విశేషాలు చూద్దాం..


















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని