మహేశ్‌ ఆనందం.. రష్మిక వర్కౌ‌ట్స్‌ - celebrities social media round up
close
Published : 01/11/2020 05:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ ఆనందం.. రష్మిక వర్కౌ‌ట్స్‌

సోషల్‌లుక్‌: సినీ తారల విశేషాలు..

* వ్యాయామం విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని కథానాయిక రష్మిక అంటున్నారు. ‘నీకు సాధించాలని ఉంటే.. వెళ్లి అందుకో’ అంటూ జిమ్‌ వీడియో షేర్‌ చేశారు. అందులో ఆమె అధిక బరువును లిఫ్ట్‌ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.

* అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుకు స్పా చేయించుకోవడం అంటే చాలా ఇష్టమట. కరోనాకు ముందు ట్రిప్‌లో తీసిన ఫొటోను నమ్రత షేర్‌ చేశారు. కామాలయా రిసార్ట్‌లో తీసుకున్న ఫొటో అదని తెలిపారు. నిజంగానే మహేశ్‌ ముఖం ఫొటోలో చాలా ఆనందంగా కనిపించింది.

* యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ కొత్త లుక్‌లో కనిపించి, సర్‌ప్రైజ్‌ చేశారు. గౌరవ్‌ గుప్తా డిజైన్‌ చేసిన తెలుపు రంగు కుర్తాలో మెరిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

* నటి హంస నందిని ఈ వారాంతాన్ని అందమైన కొండల్లో గడుపుతున్నారట. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె వీడియో షేర్‌ చేశారు. పచ్చని చెట్ల మధ్య పాస్తా చేసి, చూపించారు.
* కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన బృందంతో కలిసి తీసుకున్న వీడియో షేర్‌ చేశారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రతిసారి తమ టీం ఇలా కేక్‌ కట్ చేస్తుందని పేర్కొన్నారు. తను అందంగా కనిపించడానికి కారణం వారేనని తెలిపారు.
















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని