సోషల్‌లుక్‌: రవితేజ ఫిట్‌నెస్‌..జ్ఞాపకాల్లో నమ్రత - celebrities social media round up
close
Published : 04/11/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌లుక్‌: రవితేజ ఫిట్‌నెస్‌..జ్ఞాపకాల్లో నమ్రత

తారలు పంచుకున్న విశేషాలు..

* నమ్రత పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ‘పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌.. అప్పుడు.. ఇప్పుడు.. జీవితం ఓ వృత్తంలా సంపూర్ణమైంది. నిజంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి’ అంటూ తన పెళ్లి ఫొటో, తన తల్లిదండ్రుల పెళ్లి ఫొటో షేర్‌ చేశారు.

* అగ్ర కథానాయకుడు రవితేజ తన తర్వాతి సినిమా కోసం ఇంకా ఫిట్‌గా తయారౌతున్నారు. తెల్లవారుజామున లేచి వర్కౌట్‌ చేస్తున్నారు. మంగళవారం జిమ్‌లో తీసిన ఫొటో షేర్‌ చేశారు.

* నటి కంగనా రనౌత్‌ తన స్వస్థలం మనాలీలో ఉన్న సంగతి తెలిసిందే. ముంబయిలో గుర్రపుస్వారీ చేయడాన్ని మిస్‌ అవుతున్నానని ఆమె అన్నారు. గతంలో తీసుకున్న ఫొటోలు షేర్‌ చేశారు.

* అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా లారెన్స్‌ తెరకెక్కించిన ‘లక్ష్మీ’ సినిమాలోని ఓ గీతం విడుదలైంది. ఇందులో అక్షయ్‌ ఎరుపురంగు చీర కట్టుకుని అద్భుతంగా నటించారు. ‘బమ్‌ భోలే..’ అని సాగే గీతం వీక్షకుల్ని అలరిస్తోంది.

* అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ తన స్నేహితుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయితో కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. పవన్‌ లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇన్నాళ్లూ గడ్డంతో ఉన్న పవన్‌ ఇందులో తీసేసి కనిపించారు.














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని