పవన్‌ బ్రేక్‌లో ఇలా.. ‘అల్లు’ ఇంట్లో అట్లతద్ది.. - celebrities social media round up
close
Published : 05/11/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ బ్రేక్‌లో ఇలా.. ‘అల్లు’ ఇంట్లో అట్లతద్ది..

సోషల్‌లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..

* నటి నిషా అగర్వాల్‌ తన బావ గౌతమ్‌ కిచ్లుకు స్వయంగా మెహెందీ పెట్టారు. కర్వాచౌత్‌ వేడుకల్లో భాగంగా తీసుకున్న ఫొటో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. కాజల్‌ ఎరుపు రంగు చీరలో ఉన్న సెల్ఫీ షేర్‌ చేస్తూ కర్వాచౌత్‌ శుభాకాంక్షలు చెప్పారు.

* పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను కలిశామంటూ శ్రీముఖి, జానీ మాస్టర్‌ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ‘ఏం టైప్‌ చేయాలో తెలియడం లేదు. పవన్‌ కల్యాణ్‌ సర్‌.. లవ్‌.. లవ్‌.. లవ్‌’ అని శ్రీముఖి సంబరపడిపోయారు. పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ సినిమా షూట్‌ బ్రేక్‌లో జనసేన పార్టీ పనులు చూసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

* ‘పంచాక్షరి’, ‘బావ’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు సామ్రాట్‌ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారు. పెళ్లికి ముందు వేడుకల్లో భాగంగా తీసిన ఫొటోలు, వీడియోలను ఆయన సోదరి శిల్పారెడ్డి షేర్‌ చేశారు.

* ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఎన్టీఆర్‌ ప్రేయసిగా నటిస్తున్న హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరిస్‌ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌ కోసం ఇండియా వచ్చానని, షూటింగ్‌లో తిరిగి పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఆ ట్రిప్‌లో.. ప్రతి రోజుకు సంబంధించిన ఓ సెకను వీడియోను కలిపి షేర్‌ చేశారు.

* లాక్‌డౌన్‌లో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండని కథానాయిక సమంత కోరారు. ‘లాక్‌డౌన్‌లో యోగా చేయడం, గార్డెనింగ్‌తోపాటు రుచిగా వంట చేయడం నేర్చుకున్నా. మరి మీరు?.. కామెంట్‌ చేయండి’ అని సామ్‌ వీడియో పంచుకున్నారు.

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని