కన్నీరు పెట్టుకున్న కాజల్‌.. వెంకీ పయనం - celebrities social media round up
close
Published : 07/11/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నీరు పెట్టుకున్న కాజల్‌.. వెంకీ పయనం

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..   

* విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న ‘నారప్ప’ సినిమా షూటింగ్‌ తిరిగి ఆరంభమైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తల నడుమ చిత్రీకరణ జరుగుతోందని తెలుపుతూ చిత్ర బృందం వీడియో షేర్‌ చేసింది. నారప్ప గెటప్‌లో సిద్ధమైన వెంకీ వ్యాన్‌ నుంచి లొకేషన్‌ స్పాట్‌కు వెళుతూ కనిపించారు.

* నటి రాధిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. ఇంటి ముందు భర్త శరత్‌కుమార్‌తో కలిసి కూర్చుని తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. ‘ప్రతి రోజూ ఓ కొత్త ప్రారంభం. సుదీర్ఘంగా శ్వాస తీసుకోండి, చిరునవ్వుతో రోజును మొదలుపెట్టండి..’ అని సందేశం ఇచ్చారు.

* కాజల్‌ పెళ్లి తర్వాత ఆమె ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముహూర్త గడియల్లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కంటతడి పెట్టుకున్న ఫొటో వైరల్‌గా మారింది.

* చిరంజీవి అల్లుడు, కథానాయకుడు కల్యాణ్‌దేవ్‌ తన సతీమణి శ్రీజతో కలిసి మాల్దీవుల్లో సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడ తీసిన ఫొటోలు, వీడియోల్ని షేర్‌ చేశారు.

* శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా జాన్వి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ‘ఇవాళ నీ జన్మదినం.. ఈరోజైనా నీతో గొడవపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తా’ అంటూ సరదాగా పోస్ట్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని