హీరో వ్యవసాయం.. ‘దృశ్యం 2’ పూర్తి - celebrities social media round up
close
Published : 08/11/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరో వ్యవసాయం.. ‘దృశ్యం 2’ పూర్తి

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు.. 

* మోహన్‌లాల్‌, మీనా జంటగా నటిస్తున్న ‘దృశ్యం 2’ సినిమా 46 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జనవరిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర బృందం పేర్కొంది.

* కొత్త పెళ్లి కూతురు కాజల్‌ తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు. బ్యాగులు సిద్ధం చేసుకున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఆమె తన పేరును ‘కాజల్‌ కిచ్లు’గా మార్చుకున్నారు.

* బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ తన పటౌడీ ప్యాలెస్‌ పరిసరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. కుమారుడు తైమూర్‌ కూడా వ్యవసాయ భూమిలో ఆడుకుంటూ కనిపించాడు. చూడచక్కని ఈ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

* కథానాయకుడు సిద్ధార్థ్‌ ట్రెండీ లుక్‌లో తయారయ్యారు. ఆయన తన కొత్త ఫొటోషూట్‌ స్టిల్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి తెగ లైక్‌లు వచ్చాయి.

* కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ స్నేహితులతో కలిసి బైక్‌ రైడ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘నాలుగు చక్రాలు శరీరాన్ని నడిపిస్తాయి.. రెండు చక్రాలు మనసును నడిపిస్తాయి’ అని క్యాప్షన్‌ ఇస్తూ ఫొటో షేర్‌ చేశారు.













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని