భార్యకు అట్లీ ప్రేమతో.. జాన్వి లుక్‌ వైరల్‌  - celebrities social media round up
close
Published : 10/11/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్యకు అట్లీ ప్రేమతో.. జాన్వి లుక్‌ వైరల్‌ 

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు..

* దర్శకుడు అట్లీ తన సతీమణి ప్రియపై ఉన్న ప్రేమను తెలిపారు. తమ వివాహం జరిగి ఆరేళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ‘మనం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. నేను సరైన నిర్ణయాలు తీసుకునేలా నువ్వు నాకు మార్గదర్శకాలు సూచించావు. నా జీవితంలోని ప్రియమైన స్నేహితురాలు, సతీమణి, సర్వస్వం నువ్వు. నా లైఫ్‌లో నేను సంపాదించుకున్న అమూల్యమైన వ్యక్తివి. లవ్యూ..’ అని ఆయన పేర్కొన్నారు.

* కథానాయిక తమన్నా వెబ్‌ సిరీస్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తను ‘11th అవర్‌’ అనే తెలుగు సిరీస్‌లో నటించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని మిల్కీబ్యూటీ ఫస్ట్‌లుక్‌ షేర్‌ చేశారు. ప్రవీణ్‌ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తుండగా యు. ప్రదీప్‌ నిర్మిస్తున్నారు.

* నటుడు సునీల్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు. రాజా రవీంద్ర సవాలు స్వీకరించి మూడు మొక్కలు నాటానని తెలిపారు. ‘కలర్ ఫోటో’ టీంను, నటి సురేఖను నామినేట్‌ చేశారు.

* జాన్వి కపూర్‌ 1950ల కాలంనాటి లుక్‌ను రీ-క్రియేట్‌ చేశారు. అప్పటి కట్టు, బొట్టుతో ఆమె అందంగా తయారైన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. నెటిజన్లతోపాటు సినీ ప్రముఖులు సైతం జాన్వి ఫొటోలకు ఫిదా అయ్యారు.














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని