ప్రభాస్‌ ఫొటో వైరల్‌.. సామ్‌ వర్కౌట్స్‌ - celebrities social media round up
close
Updated : 11/11/2020 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ఫొటో వైరల్‌.. సామ్‌ వర్కౌట్స్‌

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు

* కథానాయకుడు ప్రభాస్‌.. నటి ఛార్మి పెంపుడు కుక్కతో కనిపించారు. ‘నా తొమ్మిది నెలల బేబీ బాయ్‌తో (కుక్కతో) డార్లింగ్‌ ప్రభాస్‌’ అంటూ ఆమె ఫొటో షేర్‌ చేశారు. ఈ అరుదైన దృశ్యం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

* దర్శకుడు క్రిష్‌ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. పవన్‌ కల్యాణ్‌, నిర్మాత ఎ.ఎమ్‌ రత్నం.. క్రిష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘వకీల్‌ సాబ్‌’ సెట్‌లో వీరంతా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

* కథానాయిక రష్మిక ‘యువర్‌ లైఫ్‌’కు అతిథి సంపాదకురాలిగా మారారు. ఉపాసనతో కలిసి కొన్ని రోజులపాటు పనిచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక ఫొటో షూట్‌ స్టిల్స్‌ వైరల్‌గా మారాయి.

* మొక్కల ఆధారిత ఆహారం ద్వారా ఫిట్‌గా తయారు కాలేమని ఉన్న అపోహలను బ్రేక్‌ చేసేందుకు సిద్ధమయ్యారు కథానాయిక సమంత. ఆకుకూరలు, కూరగాయల ఫుడ్‌ డైట్‌ను ఆరంభించారు. తన వర్కౌట్‌ వీడియోను షేర్‌ చేశారు.

* కథానాయిక కాజల్‌ తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి మాల్దీవుల్లో సమయం గడుపుతున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్‌ కోసం వెళ్లిన ఈ జంట అక్కడ తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేస్తూ ఉంది. గౌతమ్‌ తన ఫొటోగ్రాఫర్‌గా మారాడని కాజల్‌ ఫొటోలు షేర్‌ చేశారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని