
తాజా వార్తలు
మహేశ్ కార్బన్ కాపీ.. జయరామ్‌తో ప్రభాస్
సోషల్ లుక్: తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు
* ఈ మధ్య మహేశ్ బాబు-గౌతమ్ చూసేందుకు ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్నారు. నెటిజన్లు సైతం పలుమార్లు మహేశ్ ఫొటోలు చూసి తికమక పడ్డారు. ఇదే విషయాన్ని మరోసారి తెలుపుతూ.. నమ్రత ఫొటో షేర్ చేశారు. ‘కార్బన్ కాపీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
* సాయిధరమ్ తేజ్, నభా నటేష్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
* అలియా భట్ తన సోదరి షహీన్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి నువ్వు నా ఏంజెల్వి. మనం పేరుకు అక్కాచెల్లెళ్లం. కానీ నిజానికి నువ్వు నా సోల్‌మేట్. నా పక్కన నువ్వు లేని క్షణాన్ని ఊహించలేను..’ అని సోదరిపై ప్రేమను తెలిపారు.
* ప్రభాస్ నటుడు జయరామ్‌తో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘రాధేశ్యామ్’ సెట్లో ఈ చిత్రం క్లిక్ మనిపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉన్న సంగతి తెలిసిందే.
* ‘నిన్ను పెళ్లి చేసుకునేంత వరకు ప్రేమ ఇంత అందంగా ఉంటుందని తెలియలేదు’ అని తన భర్తపై అనురాగాన్ని పంచుకున్నారు నటి సనా ఖాన్. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోల్ని షేర్ చేశారు.